Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదేశాలను ధిక్కరిస్తారా? కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమరావతి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ గతంలో జారీచేసిన ఆదేశాలను ధిక్కరించి, సీఎం జగన్ సర్కారు విజిలెన్స్ కార్యాలయలను తరలించాలని జీవో జారీ చేసింది. దీనిపై తీవ్రంగా మండిపడింది. 
 
పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, మూడు రాజధానుల విధానంలో భాగంగా సీఎం జగన్ పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కర్నూలు, వైజాగ్‌లకు తరలించాలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా, విజిలెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేలా ఇటీవల అర్థరాత్రిపూట జీవో జారీచేశారు. 
 
దీనిపై  న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఇదే అంశంపై మరో రెండు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments