Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.5వేలు.. ట్రైనింగ్ ప్లస్ ఉద్యోగం కూడా..?

ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినట్లు తెలుస్తోదంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు భృతి

Webdunia
గురువారం, 18 మే 2017 (11:00 IST)
ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినట్లు తెలుస్తోదంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో వివిధ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో కంపెనీలు కూడా స్టైఫండ్‌ ఇస్తాయి. శిక్షణ పూర్తి కాగానే అదే కంపెనీలో ఉద్యోగం కూడా లభిస్తుందని ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
ఉద్యోగం నుంచి వేతనం అందిన తర్వాత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిలిపివేస్తుంది. స్థూలంగా ఇదీ ‘నిరుద్యోగ భృతి’ పథకం అమలు పద్ధతి. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి, విధానాల ఖరారుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 
తొలిసారి సమావేశమైన ఈ కమిటీ నిరుద్యోగ భృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై జూన్‌ 5న పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, నిపుణులతో సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా.. వివిధ కంపెనీల్లో ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైనా సబ్‌ కమిటీలో చర్చ జరిగింది.
 
దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను కంపెనీలలో శిక్షణ కోసం చేరుస్తామని, ఆ సమయంలో ప్రభుత్వం తరఫున నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు వారికి చెల్లిస్తామని, దీంతోపాటు కంపెనీ స్టైఫండ్‌గా రూ.3 వేలు ఇస్తుందన్నారు. శిక్షణ పూర్తవ్వగానే సదరు కంపెనీ ఆ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి పూర్తిస్థాయి జీతం ఇస్తుందని వివరించారు. ఎంతమందికి ఈ విధంగా చేయగలమనే అంశాన్ని పరిశీలించాలని సబ్‌ కమిటీలో నిర్ణయించినట్లు లోకేశ్‌ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments