Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేదులో తీపి : మద్యంబాబులకు శుభవార్త - ధరలు తగ్గించిన ఏపీ!!

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తాజాగా మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. క్వార్టర్ మద్యం విలువ రూ.150 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై ధరను రూ.30 వరకు తగ్గించింది. 
 
అన్ని రకాల బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపై రూ.30 తగ్గిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.150 నుంచి రూ.190 వరకు క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటును యధాతథంగా ఉంచింది. అంతకంటే ఎక్కువ ధర ఉన్న మద్యంపై భారీ ఎత్తున రేట్లను పెంచింది. ఈ పెరుగుదల కనిష్టంగా 40 రూపాయల నుంచి గరిష్టంగా 1320 రూపాయల వరకు ఉంది. ఈ సవరించిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
వాస్తానికి కరోనా లాక్డౌన్ తర్వాత ఏపీలో మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్కువ ధర ఉన్న మద్యం రేటును తగ్గించాలంటూ ప్రభుత్వానికి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో నివేదికను అందించింది. 
 
ఈ నివేదిక ఆధారంగా ధరలను ప్రభుత్వం సవరించింది. మద్యం ధరలను భరించలేక పలు చోట్ల పేదలు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈబీ ప్రభుత్వాన్ని తన నివేదికను అందించింది. ఈ నివేదిక ప్రకారం మద్యం ధరలను ఏపీ సర్కారు తగ్గించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments