Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఎందుకంటే....

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2015 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి పేరునే ఎంపిక చేయడానికి, ఖరారు చేయడానికి, ప్రకటించడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. చారిత్రకంగా, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకంగా చూసినా నూతన రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలో వస్తుందని... నూతన రాజధానికి అమరావతి అని పేరు పెడితే బాగుంటుందని... దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని... ఈ పేరు చాలా బాగుంటుందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతే ఏపీ రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 
 
శాతవాహనుల రాజధానిగా 400 సంవత్సరాలకు పైగా దీనికి గుర్తింపు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలలో ఒకటైన అమరేశ్వర ఆలయం, ఈ పేరు మీదగానే అమరావతి వచ్చిందని పురాణాలు చెపుతున్నాయన్నారు. అమరావతికి చారిత్రక, పౌరాణిక వైభవం ఉందని, ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి పేరుందని, ఇన్ని ప్రఖ్యాతలు ఉన్న అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక మోడ్రన్ సిటీగా, అందరికీ అనుకూలంగా రాజధాని నిర్మాణం చేయాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments