Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి వైకాపా మద్దతుదారుడి ఇంటిలో రూ.25 కోట్ల నగదు స్వాధీనం

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ఈ పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు రూ.25 కోట్ల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. 
 
అలాగే, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ ప్రకాశ్‌బాబు తెలిపారు. 
 
చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ : సీఎన్ఎన్ నివేదిక
 
చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ అవతరించనుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తన నివేదికలో అంచనా వేసింది. ముఖ్యంగా, 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందని పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థను సూపర్ పవర్‌గా రూపాంతరం చెందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, దేశీయ దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకోసం బాటలు వేస్తున్నారని విశ్లేషించింది.
 
అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న రంగాల్లో అదానీ, అంబానీ పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు అభినందిస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది. అభివృద్ధిని ప్రోత్సహించేందుకుగానూ బీజేపీ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం ద్వారా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల పరివర్తనను ప్రారంభించిందని పేర్కొంది. మోడీ ప్రభుత్వం డిజిటల్ కనెక్టివిటీని భారీగా ప్రోత్సహిస్తోందని, ఈ విధానం వాణిజ్యం, రోజువారీ జీవితాలను మరింత మెరుగుపరుస్తోందని కొనియాడింది.
 
దేశంలో విప్లవాత్మక మార్పుల్లో అదానీ, అంబానీ ఇద్దరూ కీలక వ్యక్తులుగా మారారని ప్రశంసించింది. 2023లో భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని, మోడీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 4 స్థానాలు ఎగబాకి యునైటెడ్ కింగ్ డమ్‌ను అధిగమించిందని ప్రస్తావించింది. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలవనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments