Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 21 కరోనా కేసులు..

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:38 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 402కి చేరింది. గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. 
 
గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించగా.. 11 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 385 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
క‌ర్నూలు జిల్లాలో కరోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఆ జిల్లాలో కొత్త‌గా మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల‌ సంఖ్య 82కు చేరింది. కొత్త‌గా న‌మోదైన ఐదు కేసులు కూడా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివేన‌ని అధికారులు తెలిపారు. జిల్లాలో కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments