Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఎఫెక్ట్.. చంద్రబాబు స్పందన.. రాజధానిని 5వేల లేదా 50వేల ఎకరాల్లోనూ...

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (13:28 IST)
పవన్ కల్యాణ్ ఏపీ పర్యటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన వాదనను మరోమారు బలంగా వినిపించారు. తుళ్లూరు పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, అక్కడి రైతులతో భేటీ సందర్భంగా, తక్షణమే భూ సమీకరణను నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ విషయంపై సర్కారుతో మాట్లాడతానని చెప్పిన పవన్, అవసరమైతే సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు.
 
పవన్ ప్రసంగం ముగిసిన కొద్దసేపటికే హైదరాబాదులో చంద్రబాబు స్పందించారు. అయితే పవన్ వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించని ఆయన తన ప్రభుత్వ ఉద్దేశాన్ని సుస్పష్టం చేశారు. జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన ఆయన ‘‘నవ్యాంధ్ర రాజధానిని 5 వేల ఎకరాల్లో కట్టొచ్చు, 50 వేల ఎకరాల్లోనూ కట్టొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. రాజధాని వల్ల తుళ్లూరు రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు స్వచ్ఛందంగానే ముందుకొచ్చారని బాబు పేర్కొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments