Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - సభ ముందుకు 14 ఆర్డినెన్స్‌లు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. 
 
ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించనుంది. 
 
సభ ప్రారంభమైన వెంటనే ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌  తమ్మినేని సీతారాం తిరస్కరించారు.  అలాగే, ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments