Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2లక్షల కోసం సహజీవనం చేసే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 7 ఆగస్టు 2024 (16:32 IST)
డబ్బు కోసం సహజీవనం చేసే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఓ దుండగుడు. అనంతపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 60 శాతం కాలిపోయిన ఆ మ‌హిళను స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ఆ మ‌హిళ వాంగ్మూలాన్ని రాయ‌దుర్గం జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి న‌మోదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
 
మంగళవారం అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ప‌ట్ట‌ణంలోని రాజీవ్ గాంధీ కాల‌నీలో జ‌రిగింది. వివరాల్లోకి వెళితే.. పార్వ‌తి, మోహ‌న్ అనే వ్యక్తితో స‌హ‌జీనం చేస్తుండేది. మ‌హిళ‌కు ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరిట బ్యాంక్‌లో రూ.2 ల‌క్ష‌ల డిపాజిట్ ఉండింది. కుమార్తె పేరు మీద బ్యాంక్‌లో రూ.2 ల‌క్ష‌లు ఉంద‌ని మోహ‌న్ తెలిసింది. అయితే త‌న‌కు ఆ రెండు ల‌క్ష‌ల రూపాయాలు కావాలని కుమార్తెను తీసుకెళ్లిపోయాడు.
 
రెండు ల‌క్ష‌ల రూపాయాలు ఇస్తేనే, కుమార్తెను ఇస్తాన‌ని పార్వతికి చెప్పాడు మోహ‌న్. అయితే అందుకు పార్వ‌తి తాను రెండు ల‌క్ష‌ల రూపాయాలు ఇస్తాన‌ని, ఆ త‌రువాత త‌మ జోళికి రావ‌ద్ద‌ని అత‌నితో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు లక్షలిచ్చి అతనితో దూరంగా వుండిపోయింది. 
 
ఈ స‌మ‌యంలో మోహ‌న్, ఆయ‌న సోద‌రుడు సిద్ధులు క‌లిసి పార్వ‌తిపై దాడి చేశారు. త‌మ‌తో తెచ్చుకున్న పెట్రోల్‌ని పార్వ‌తిపై పోసి నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు గుర్తించి కాలిపోతున్న ఆమె ద‌గ్గ‌ర‌కు హుటాహుటినా అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు ఆపారు. వెంట‌నే చికిత్స నిమిత్తం పార్వ‌తిని రాయ‌దుర్గం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments