Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరంట్ల మాధవ్‌ వీడియో ఫేక్.. అనంతపురం జిల్లా ఎస్పీ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (18:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను చర్చకు దారితీసిన వైకాపా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందిన నగ్న వీడియోపై అనంతపురం ఎస్పీ కీలక ప్రకటన చేశారు. అది గోరంట్ల మాధవ్ నిజమైన వీడియో కాదని, ఫేక్ వీడియో అని ప్రకటించారు. 
 
ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం అనంత‌పురంలో మీడియా ముందుకు వ‌చ్చిన జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ వీడియో ప‌లుమార్లు షేర్ అయినందువ‌ల్ల‌... ఆ వీడియో ఒరిజిన‌లా?, ఫేకా? అన్న విష‌యాన్ని తేల్చ‌డం క‌ష్టంగా మారింద‌న్నారు.
 
ఎంపీకి చెందిన‌దిగా భావిస్తున్న ఈ వీడియో ఇంగ్లండ్‌లో రిజిష్ట‌ర్ అయిన నెంబ‌రు నుంచి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యింద‌ని ఫ‌కీర‌ప్ప చెప్పారు. ఈ వీడియో తొలుత ఐటీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ అయ్యింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌న్నారు. 
 
ఈ వీడియోను ఇంగ్లండ్‌లోనే అప్‌లోడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంద‌న్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్య‌క్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని చెప్పారు. ఇక ఈ వీడియో ఒరిజిన‌లా?, న‌కిలీనా? అన్న‌ది తేల్చాలంటే ఒరిజిన‌ల్ వీడియో అందుబాటులో ఉంటేనే సాధ్య‌మ‌న్నారు. ఒరిజిన‌ల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగ‌ల‌మ‌ని, లేకుంటే అది సాధ్యంకాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments