Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక....

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (15:37 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటన ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం, సీసీకొత్తపేట బస్టాప్ వద్ద జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అంజలి అనే మహిళకు మహేంద్ర అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అయితే, అంజలికి తమ సమీప బంధువైన యోగానంద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలిసి ఇరువరిని మందలించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇకపై తామిద్దరం కలుసుకోలేమని భావించి వారిద్దరూ ఇంటి నుంచి గత శుక్రవారం పారిపోయారు. 
 
ఆ మరుసటి రోజు శనివారం సీసీకొత్తపేట బస్టాప్‌ సమీపంలో పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి వారిని ధర్మవరం దవాఖానకు తరలించగా అంజలి మృతి చెందింది. యోగానంద్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments