ప్రేమించి పెళ్లి చేసుకుని చంపేశాడు.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి చిక్కాడు...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (12:52 IST)
జిల్లా కేంద్రమైన అనంతపురం శివారు ప్రాంతంలోని సుశీల రెడ్డి కాలనీలో జరిగిన ఓ హత్య కేసులోని ఓ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి, ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం నగరశివారులోని సుశీల రెడ్డి కాలనీకి చెందిన సరోజ (28) అనే మహిళ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన జగదీశ్వర రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కులాల అడ్డు గోడులను కూల్చి తొమ్మిది నెలల క్రితం ఒక్కటయ్యారు. 
 
రెండుమూడు నెలలవరకు సక్రమంగా వీరి కాపురం జరిగింది. ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు చోటుచేసుకోసాగాయి. కానీ చిన్న చిన్న గొడవలను పెద్దవిగా తీసుకున్న జగదీశ్వర రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం భార్యను చంపాలని ప్లాన్ చేశాడు. 
 
ఈ క్రమంలో యాక్సిడెంట్‌గా చిత్రీకరించి భార్యను చంపేయాలని భావించిన జగదీశ్వర రెడ్డి బైక్‌పై భార్యను ఎక్కించుకుని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రొడ్డుపై కింద పడేశాడు. కిందపడిన తర్వాత ఆమె తలపై బలంగా కొట్టి జగదీశ్వర రెడ్డి కిరాతకంగా సరోజను చంపేశాడు. ఆ తర్వాత జగదీశ్వర రెడ్డి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి చికిత్స చేయించుకునేందుకు వెళ్లాడు. 
 
లారీ ఢీ కొట్టడంతో భార్య చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు జగదీశ్వర రెడ్డిని గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మృతురాలి తండ్రి ప్రభుదాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జగదీశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments