Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో దారుణం: బాలికను 3 రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారం..

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రయించారు. ఈ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:35 IST)
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటనపై నిందితుల నిర్భయ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. గుత్తి జంగాలకాలనీకి చెందిన 13ఏళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. 
 
కాగా, బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అడ్డుకుని, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తల్లిదండ్రులు బాలిక కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలు విలపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments