Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నర దశాబ్దాల తర్వాత సొంత గూటికి ఆనం బ్రదర్స్.. ముహుర్తం ఖరారు

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (11:07 IST)
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆనం సోదరులు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అదీ కూడా రెండున్నర దశాబ్దాల తర్వాత పసుపు చొక్కా ధరించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ ఐదో తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. వివాదాస్పద ప్రకటనలకేకాకుండా, ముక్కుసూటిగా మాట్లాడే సీనియర్ ఆనం వివేకానంద రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటే, సౌమ్యుడిగా ముద్రపడిన జూనియర్ ఆనం రాంనారాయణరెడ్డి చడీచప్పుడు లేకుండా పనులు చక్కబెడతారన్న పేరుంది. ప్రస్తుతం వీరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. రాష్ట్ర విభజన ఫలితంగా వీరు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలెట్టి.. అవి సఫలీకృతమయ్యేలా చేసుకున్నారు. 
 
నిజానికి వీరిద్దరు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో వీరు చేరిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అక్కడ పడక, ఆ పార్టీకి వీడ్కోలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలా 25 ఏళ్ల పాటు వారు కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అవుతూ వచ్చారు. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆనం బ్రదర్స్‌కు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఆయన కేబినెట్‌లో ఆనం రామనారాయణ రెడ్డి కీలక భూమిక పోషించారు. 
 
వైఎస్ అకాల మరణం తర్వాత రోశయ్య కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లోనూ అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, ఆనం బ్రదర్స్‌కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైన ఆనం బ్రదర్స్ తిరిగి సొంత గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించడమేకాకుండా, వారికిచ్చే పార్టీ పదవులను కూడా ఖరారు చేశారని సమాచారం. పైగా వీరు సైకిల్ ఎక్కే ముహుర్త తేదీని డిసెంబర్ 5గా ఖరారు చేశారు. ఆ రోజునే వీరికి పార్టీ పదవులు కూడా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments