Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మా మిత్రుడు... పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2 స్పెషల్ గిఫ్ట్ హోదా ఇచ్చేద్దాం... అమిత్ షా సై?

భాజపా చీఫ్ అమిత్ షాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. అందుకే పవన్ కళ్యాణ్ ఆవేదనను ఆయన అర్థం చేసుకున్నాననీ, ప్రత్యేక హోదాపై మరింత జాప్యం చేసేకొద్దీ శత్రువులు పెరుగుతారు తప్పించి ప్రయోజనం ఉండదు కనుక వెంటనే దానిపై తేల్చేయాలని అమిత్ షా కేంద్ర ప్రభుత్వ ప

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (12:00 IST)
భాజపా చీఫ్ అమిత్ షాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. అందుకే పవన్ కళ్యాణ్ ఆవేదనను ఆయన అర్థం చేసుకున్నాననీ, ప్రత్యేక హోదాపై మరింత జాప్యం చేసేకొద్దీ శత్రువులు పెరుగుతారు తప్పించి ప్రయోజనం ఉండదు కనుక వెంటనే దానిపై తేల్చేయాలని అమిత్ షా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబరు 2న ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ప్రత్యేక హోదా అనేది నేరుగా కాకుండా ప్రత్యేక హోదా చట్టంలో ఏమేమి ఇస్తారో అవన్నీ విడివిడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా పెండింగులో ఉన్నవన్నీ పూర్తిగా నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్ర పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలను వదులుకునే పరిస్థితి లేదనీ, 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే దక్షిణాదిలో తమకు వెన్నుదన్నుగా ఉంటాయని షా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ప్రత్యేక హోదా ప్రకటన చేస్తే దీనికి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటికే తమకు కూడా ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్లు చేస్తున్న రాష్ట్రాల్లో ఆందోళనలు రేగే అవకాశం ఉన్నది కనుక పార్టీ శ్రేణులు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments