Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ రెడ్డి ఎవరే తెలుసా? జయలలిత, శశికళ, లోకేష్ బినామీ: అంబటి రాంబాబు

శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 170 కిలోల బంగారం, రూ.

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (15:09 IST)
శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 170 కిలోల బంగారం, రూ.131కోట్ల నగదు, రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వేలూరులో శేఖర్ రెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్లధనాన్ని త్వరగా మార్చుకోవడానికే చంద్రబాబు తన దుబాయ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారని అంబటి ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల చెన్నైలో కోట్ల రుపాయల ఆస్తులతో ఐటీ అధికారులకు పట్టుబడ్డ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయడు అఖిలేశ్‌, జయలలిత సన్నిహితురాలు శశికళ బినామీయేనని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
 
చంద్రబాబు బినామీలు ప్రస్తుతం నోట్ల మార్పిడి పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. అసలు ఏ ప్రాతిపదికన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎన్నిక చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నారా లోకేష్‌కు రూ. 100 కోట్లు చెల్లించి శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా అయ్యారని తెలుస్తున్నదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments