Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2ను నయవంచన దినంగా పాటించాలి : అంబటి రాంబాబు

Webdunia
శనివారం, 23 మే 2015 (15:05 IST)
జూన్ రెండో తేదీని నవ నిర్మాణ దీక్షగా నిర్వహించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. జూన్ 2న 'నవ నిర్మాణ దీక్ష'ను ఉత్సవ దినంగా కాకుండా నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన తొలి సంతకాల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలు కాలేదని ఆరోపించారు. చెప్పిన అబద్దం మళ్లీ చెప్పకుండా అబద్దాలు చెబుతూ చంద్రబాబు కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. ప్రచారానికి పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు... రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి యేడాది పాలన వంచనతో సాగిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారం కోసం ఇచ్చే ప్రాధాన్యం అభివృద్దిపై పెడితే మంచిదని అంబటి రాంబాబు సూచించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments