Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింపతీ కోసం చంద్రబాబు సిల్లీ ఫీట్లు : అంబటి రాంబాబు సెటైర్లు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (14:44 IST)
సింపతీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిల్లీ ఫీట్లు చేస్తున్నారంటూ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే, 
 
* వరదలు వచ్చింది మొదలు వరద వెళ్ళే వరకు రాష్ట్రంవైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. 
* మంగళవారం పరామర్శ పేరుతో ప్రభుత్వంపై అసత్యాలు మాట్లాడారు.
* ఇవి కృత్రిమైన వరదలు అంట, ఆయన ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రబాబు సింపతీ పొందాలనే మాటలు మాట్లాడుతున్నాడు. 
* చంద్రబాబుకు చెయినొప్పి అని హైద్రాబాద్ వెళ్లానని చెబుతున్నారు. అయితే తమరి పుత్రుడు ఎక్కడ ఉన్నాడో చంద్రబాబు చెప్పాలి.
* రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు డ్రోన్ డ్రామాలు ఆపాలి .
* మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా నదీ పరివాహంలో ఉన్న అక్రమకట్టడాలను కూలుస్తామని చెప్పేలేదా. 
* ఆ అక్రమ కట్టడాలకు అప్పట్లో నోటీసులు ఇవ్వలేదా? ఈ రోజు అదే అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఉండటంలేదా. 
* వరద వున్నప్పుడు చంద్రబాబు లేరు.. గేట్లు మూసేసాక వచ్చి వరద బాధితులను పరామర్శించారు. 
* వరదలను కూడా రాజకీయ లబ్దికోసం చేయడం మంచిదికాదు. 
* గొంగట్లో తింటూ వెంట్రుకలు వచ్చియాయన్నట్లుగా.. వరద ముప్పు ఉన్న అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటూ నన్ను ముంచాలని ప్రభుత్వం చూసిందని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు.
* అలాంటి అక్రమ కట్టడంలోనే అధికారిక నివాసం ఏర్పాటు చేసుకోవడం వెనుక.. మీరు గడ్డి తిన్నారు అనేది అర్థమవుతుంది. 
* అమెరికాలో సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేయలేదని మతం రంగు పులిమి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 
* దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టేయమన్నట్లు.. వాస్తవం తెలుసుకోకుండా సీఎంపై ఆరోపణలు చేస్తున్నారు.
* అమెరికాలో అగ్గి వెలిగించడం నేరం.. వాస్తవాలు తెలుసుకోకుండా బిజేపి పార్టీ వారు మాట్లాడటం శోచనీయం.
* కమలదళంలో పచ్చ పుష్ఫాలు.. చేరాయి బిజేపి నేతలు అప్రమత్తంగా ఉండండి.
* కమలవనంలో చేరిన పచ్చపుష్పం సియం రమేష్.
* 45 ఆలయాలను చంద్రబాబు కూలుస్తుంటే ఏం చేశారు మాణిక్యాలరావు గారు.
* మాణిక్యాలరావు రాష్ట్రంలో దేవాలయ భూములైన సధావర్తి భూములు మింగుతుంటే 
మాట్లాడలేదు.
* మంత్రి బొత్సా వ్యాఖ్యల్లో తప్పు ఏముంది. శివరామకృష్ణ ఇచ్చిన నివేదిక వ్యాఖ్యలనే ఉదహరించారు. అది వాస్తవం కూడా.
* అమరావతి నిర్మాణం అపుతామని చెప్పలేదు. మా మ్యానిఫెస్టోని మేము చాలా క్లియర్‌గా చెప్పాం. 
* అమరావతిపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. పోలవరం, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం. 
* బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి టెలికాస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments