Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా పేరు వింటేనే చంద్రబాబు ఫ్యాంటు తడిసిపోతోంది : అంబటి రాంబాబు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2016 (14:30 IST)
తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే. రోజా పేరు వింటేనే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాంటు తడిసిపోతోందని, అందుకే ఆమె అంటు ఆయన వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేసిన తర్వాత కూడా ఆమెను సభలోకి అడుగుపెట్టనీయకుండా చంద్రబాబు సర్కారు అడ్డుకున్న తీరు జుగుత్సాకరంగా ఉందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికృతరూపం ఎలా ఉంటుందో రోజా సస్పెన్షన్ ఘటన చూసి ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. వాస్తవానికి శాసనవ్యవస్థ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం కూడదని ఎప్పటినుంచో అంటున్నారని, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా సస్పెండ్ చేసినప్పుడు కోర్టులు చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని తీర్పులిచ్చాయని, వాటిని సభలు కూడా ఆమోదించాయని అంబటి గుర్తు చేశారు. 
 
కోర్టు ఆదేశాల అనంతరం సభకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చిన రోజాను అడ్డుకోవడంపట్ల ఆయన స్పందిస్తూ ప్రతిపక్షంపై చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కోర్టులు తీర్పులు ఇచ్చాయని, వాటిని సభలు గౌరవించాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం స్పీకర్, ముఖ్యమంత్రి మాత్రం వాటిని గౌరవించడం లేదని, వ్యక్తిగత కక్షను పెంచుకున్నారని మండిపడ్డారు.  
 
ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇంతలా చంద్రబాబు కక్ష కట్టడానిక కారణం ఎంటో తెలియదన్నారు. గతంలోనూ సీఎంగా, ప్రతిపక్షనేతగా వ్యవహరించిన వ్యక్తి విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వాదనాలు విన్న తర్వాతే న్యాయమూర్తి తన ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని గౌరవించాలని అంబటి రాంబాబు సూచించారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments