Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జెడ్పీ ఎన్నికల్లో ధర్మానిదే విజయం : అంబటి

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (16:07 IST)
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ధర్మం, న్యాయానిదే విజయమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం జరిగిన ఈ పరోక్ష ఎన్నికల్లో జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను లాటరీ విధానం ద్వారా వైకాపాకు దక్కిన విషయం తెల్సిందే. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ... నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందన్నారు.
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 31 స్థానాలను గెలుచుకున్న తమ పార్టీ, పూర్తి మెజార్టీ సాధించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అధికార పక్షం కుట్రలు పన్ని జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నించిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ తరఫున గెలిచిన ఎనిమిది మంది జడ్పీటీసీలను తమవైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అయితే అనేక ఊహించని పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలో గెలుపు తమనే వరించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన టీడీపీకి తగిన గుణపాఠం నేర్పినట్లైందని ఆయన చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments