Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఏపీ సీఎం కాదు.. టూరిస్ట్ ముఖ్యమంత్రిగా మారారు : అంబటి రాంబాబు

Webdunia
ఆదివారం, 8 మే 2016 (15:56 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా కంటే.. టూరిస్టు ముఖ్యమంత్రిగా బాగానే రాణిస్తున్నారన్నారు. 
 
అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు. 
 
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మంగళవారం నుంచి చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఢిల్లీలో మరోసారి ఉద్యమిస్తామన్నారు. మాకు మద్దతుగా టీడీపీ ఎంపీలను పంపుతారా అని ప్రశ్నించారు. 
 
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పోరాడి సాధించుకుంటామని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. అయినా కేంద్రంతో పోరాడే దమ్ము ఆయనకు లేదని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments