Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ద్రోహి ఎమ్మెల్యే బాలకృష్ణ - హీరోకు చేదు అనుభవం

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆ పార్టీ తరపున అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటుడు బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ద్రోహి అంటూ వైకాపా కార్యకర్తలు, నేతలు నినాదాలు చేస్తూ బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. 
 
తన సొంత నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు... అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంట, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
కాగా, గత కొన్ని రోజులుగా రాజధాని కోసం తమ భూములు ఉచితంగా ఇచ్చిన రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన చేస్తున్న రైతులకు వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments