Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల వద్దకు అందమైన అమ్మాయిలు: లక్షలు గుంజుకుంటున్న ముఠా

అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్రలో విజయవాడ, గుంటూరు జిల్లాలో యువ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి అమ్మాయిలను దించి.. భ

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (13:19 IST)
అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్రలో విజయవాడ, గుంటూరు జిల్లాలో యువ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి అమ్మాయిలను దించి.. భారీ మొత్తాన్ని గుంజేసుకునే ముఠా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ వైద్యులే లక్ష్యంగా మోసగత్తెలైన అందమైన అమ్మాయిలను వారి వద్దకు వైద్యం కోసం పంపుతారు. ఆ అమ్మాయిలు మాయమాటలు చెప్పి వారిని లోబరుచుకుంటారు. వైద్యుల వద్ద తన భర్త సంసారానికి పనికిరాడని చెప్తూ.. వారికి దగ్గరవుతారు. ఆపై ఇంటికి పిలిపించుకుని రాసలీలలు మొదలెడుతారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తారు. ఆ వీడియోలను వారికే పంపి బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు గుంజుతారు. ఇలా 11 మంది వైద్యులు మోసగత్తెల వలలో చిక్కుకున్నారని పోలీసులు వెల్లడించారు. 
 
30-40 ఏళ్ల వయస్సు మధ్యనున్న వైద్యుల ఆస్పత్రులను ఎంచుకుని ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం లక్షలు గుంజుకుంది. అయితే ఇటీవల గుంటూరుకు చెందిన ఓ యువ డయాబెటాలజిస్ట్ నుంచి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేయడంపై ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఒంగోలు, విజయవాడలో ఈ మోసగత్తెల చేతిలో వైద్యులు మోసపోయారని.. ఇంచుమించు రూ.50 లక్షలకు పైగా సమర్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments