Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరా! రాజ‌ధాని మారింది ... ‘అమరావతి’ పాఠం తొలగింపు!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (10:07 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌, ఇక్క‌డ రాజ‌ధాని అనేది క‌ల‌గానే మిగిలిపోయింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్మించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విశ్వప్ర‌య‌త్నం చేశారు. తాత్కాలిక రాజ‌ధానిని తేగ‌లిగారేకాని, దాన్ని శాశ్వ‌తం చేయ‌లేక‌పోయారు. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానిగా పేర్కొని, విశాఖ‌, క‌ర్నూలు మ‌రో రెండు రాజ‌ధానుల‌ను సంక‌ల్పించారు. 
 
చంద్రబాబు హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని పాఠ్యాంశంగా చేర్చ‌గా, ఇపుడు దానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలగించింది. పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు.

తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి, 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేయడం కొస‌మెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments