Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పనులన్నింటిని సత్వరమే ప్రారంభించాలి: గోపాల కృష్ణ ద్వివేది

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (07:21 IST)
కమిషనర్ పిఆర్ & ఆర్.డి కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పిడి, డ్వామాలు, జిల్లా పరిషత్ సిఇఒ, పిఆర్ ఇంజనీర్లతో పలు కార్యక్రమాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ సమీక్షించారు.

గురువారం జరిగిన కాన్ఫరెన్స్ లో ముఖ్య కార్యదర్శి  గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు,  రైతు భరోసా, అంగన్ వాడీ కేంద్రాల పనులన్నింటిని సత్వరమే  ప్రారంభించాలని అన్నారు. 

ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా నాడు- నేడు కింద పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం జూలై 31 లోపు పూర్తిచేయాలని, నిర్దేశిత గడువు లోపు అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయని అధికారులపై తీవ్ర చర్యలు౦టాయని అయన  హెచ్చరించారు.

సిమెంట్ బిల్లుల ఎఫ్.టి.ఒ సఫరేట్ అప్ లోడ్ చేయాలని ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.. ఇదే సమావేశంలో ఆర్ డబ్ల్యూఎస్, పారిశుద్ధ్యం గురించి సమీక్షిస్తూ, ఆగస్ట్ 15 లోపు  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. 

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, పి. గిరిజా శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణంలో 24 లక్షల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని ఈ సందర్భంగా అధికారులకు  తెలిపారు.

అలాగే ఆగస్ట్ 15న  పంపిణీ చేయనున్న అన్ని  ఇళ్ళ స్థలాల లే అవుట్ లలో  మొక్కలు నాటే పనులను ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని, మిగిలిన అన్ని ప్లాంటేషన్ పనులను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సిమెంట్ బిల్లులను  డ్రైవ్ లా నిర్వహించి రెండు రోజుల్లో అన్ని ఎఫ్.టి.ఒలను క్లియర్ చేస్తామని   పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇజిఎస్ సంచాలకులు పి. చిన తాతయ్య, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి సంపత్ కుమార్,  గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments