సర్.. వచ్చేయమంటారా.... ఆమెకు జగన్ బంపర్ ఆఫర్ ..?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (23:07 IST)
ఎపిలో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఆంధ్రప్రదేశ్ లో అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కొంతమంది పక్క పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశంపార్టీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలే వైసిపిలోకి వెళ్ళాలనుకుంటుంటే ఓడిపోయిన మరికొంతమంది మాజీలు కూడా వైసిపి వైపు చూస్తున్నారు.
 
అందులో మొదటి వరుసలో కర్నూలుజిల్లా ఆళ్ళగడ్డకు చెందిన భూమా అఖిలప్రియ ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన భూమా అఖిలప్రియ ప్రస్తుతం తెలుగుదేశంపార్టీలో ఉన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆమెకు టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. పర్యాటక శాఖామంత్రిగా కూడా పనిచేశారు.
 
వయస్సు తక్కువైన తనకు కేటాయించిన శాఖపై పట్టుసాధించి మంత్రిగా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఇప్పుడు నిరుత్సాహంతో ఉన్నారు భూమా అఖిలప్రియ. తన తండ్రి గతంలో వైసిపిలో ఉండేవారు. అందుకే తిరిగి అదే పార్టీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారట అఖిలప్రియ.
 
ఇప్పటికే జగన్ తో తన సన్నిహితుల ద్వారా మాట్లాడించినట్లుగా తెలుస్తోంది. కర్నూలులో రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న భూమా అఖిలప్రియ లాంటి వారు వైసిపిలోకి వస్తే మంచిదన్న అభిప్రాయంలో జగన్ ఉన్నారట. అందులోను భూమా నాగిరెడ్డికి జగన్ కు మధ్య గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేది. ఆ పరిచయంతోనే మళ్ళీ అఖిలప్రియను పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్థంగా ఉన్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments