Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆస్పత్రిలో చేరాడా? కుటుంబ సభ్యులు అక్కడ నిల్చుని? పోస్టులపై నెటిజన్స్ ఫైర్

సోషల్ మీడియాలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో అధికార పక్షం నేతలు విపక్షంపై విమర్శలు గుప్పించింది. తాజాగా వైకాపాపై టీడీపీ సోషల్ మీడియాలో వార్ మొదలెట్టింది. లోకేశ్‌పై పోస్ట్ పెట

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:38 IST)
సోషల్ మీడియాలో  ఏపీ మంత్రి నారా లోకేష్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో అధికార పక్షం నేతలు విపక్షంపై విమర్శలు గుప్పించింది. తాజాగా వైకాపాపై టీడీపీ సోషల్ మీడియాలో వార్ మొదలెట్టింది. లోకేశ్‌పై పోస్ట్ పెట్టినందుకు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేయడం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కానీ టీడీపీ ప్రస్తుతం జగన్ ఫ్యామిలీపై పోస్టులు పెట్టి.. ఎక్కువే చేసింది.
 
నోట్ల రద్దుతో జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రి పాలైనారని.. ఆయన కుటుంబ సభ్యులు అక్కడ నిలబడి చూస్తున్నట్లు పోస్టులు చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దోపిడీదారుగా, పనికిరాని వాడుగా, దొంగ ఎన్నెన్నో సినిమా క్యారెక్టర్లకు మార్ఫింగ్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ పోస్టుల్ని చూసిన వారంతా నారా లోకేష్‌ను ఏకిపారేస్తే రవికిరణ్‌ను అరెస్ట్ చేసిన సర్కారు.. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే జగన్‌పై విమర్శలు చేస్తే మిన్నకుండిపోయిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ అనుబంధ వర్గాలు.. విపక్ష నేత జగన్‌పైన, మరణించిన ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డిపైనా వందల కొద్దీ పోస్టులు పెట్టిన సంగతి మాత్రం మరచిపోయినట్లున్నారని ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments