Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిట్ట మధ్యాహ్నం ప్రియుడితో భార్య, ఇతడు నా అన్న వరస అంటూ చెప్పిన భార్య, కానీ...

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (15:26 IST)
వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో  ఎంజాయ్ చేసింది. కానీ ఎక్కువరోజులు అలా సాధ్యం కాలేదు. భర్తకే అడ్డంగా దొరికిపోయింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూసేశాడు భర్త. కానీ అతను తనకు అన్న అవుతాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు ఏమైందంటే..
 
తెలంగాణా రాష్ట్రం మద్దూర్ మండలం హన్మతండాకు చెందిన మోహన్, వినోదకు సరిగ్గా 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మోహన్ హోటల్‌లో పనిచేస్తుంటే.. వినోద కూలి పనిచేస్తుండేది. కరోనా కారణంగా వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడింది.
 
దీంతో మళ్ళీ ఇద్దరు పనికి వెళ్ళడం ప్రారంభించారు. కూలి పనులు చేసేవారు ఎక్కువగా ఉండటంతో వినోదను వద్దని చెప్పాడు మేస్త్రి రాజు. తన ఇంటి పరిస్థితి బాగా లేదని రెండు నెలల క్రితం అతన్ని ప్రాధేయపడింది. కానీ తన కోరిక తీరిస్తే పనిచేసేందుకు పెట్టుకుంటానన్నాడు.
 
వేరే గత్యంతరం లేక రాజుతో కలిసిపోయింది వినోద. ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది. పనికి వచ్చినప్పుడల్లా.. సమయం దొరికినప్పుడల్లా రాజు, వినోదలు తరచూ కలుస్తూనే ఉండేవారు. ఈ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్తపడింది వినోద. కానీ కొన్నిరోజుల క్రితం రాజుతో కలిసి ఉండటాన్ని గమనించాడు మోహన్.
 
అతనితో క్లోజ్‌గా ఉండటంతో వినోదను హెచ్చరించాడు. విషయం బయటకు తెలిసిపోయి చివరకు తన భర్త ఇంటి నుంచి పంపిచేస్తాడేమోనన్న భయంతో ప్రియుడు రాజుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. అతన్ని చంపేయమని కోరింది. స్నేహితుల సహాయంతో మోహన్‌కు పూటుగా మద్యం తాగించి ఊపిరాడకుండా చంపేశారు. మొదట్లో ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆ తరువాత మాత్రం అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments