Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన వాడే ప్రియుడు... మరొకతనితో రొమాన్స్... కాదన్నందుకు కోసేసింది....

పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చి

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:31 IST)
పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చిత్తూరు శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చనాయుడు కండ్రిగలో నివాసముంటున్న గుర్రప్ప, లక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రవళ్లిక అనే యువతితో గుర్రప్పకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ళ పాటు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఇద్దరూ కాపురం పెట్టి సహజీవనం కూడా చేశారు. 
 
ప్రవళ్లిక అనాధ. గుర్రప్పతో రెండు సంవత్సరాల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ప్రవళిక మరో ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పరచుకుంది. గుర్రప్పకు విషయం తెలియడంతో మందలించాడు. దీంతో ప్రవళ్లిక నిన్న రాత్రి గుర్రప్ప తన ఇంటిలో నిద్రిస్తుండగా మర్మాంగాలను కోసేసి గొంతు నులిపి చంపేసింది. ప్రస్తుతం ప్రవళ్లిక పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments