Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ కొరడా, ఏపీ ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు

రాష్ట్రంలో మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. ఎక్కడబడితే అక్కడ మద్యం అనధికారికంగా అమ్మకుండా, కల్తీ మద్యం నిరోధించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎక్సైజ్ శాఖవారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల దాడులు అధికం చేశారు. కేసులు న

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (19:45 IST)
రాష్ట్రంలో మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. ఎక్కడబడితే అక్కడ మద్యం అనధికారికంగా అమ్మకుండా, కల్తీ మద్యం నిరోధించేందుకు  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎక్సైజ్ శాఖవారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల దాడులు అధికం చేశారు. కేసులు నమోదు చేసి, వేల మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అనధికార మద్యం అమ్మకాలకు సంబంధించి 4,466 కేసులు నమోదు చేశారు. 4,457 మందిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ దాడులలో 14,953 లీటర్ల ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్)ను, 4,436 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ నుంచి 16,754 కేసులు నమోదు చేసి, 16,450 మందిని అరెస్ట్ చేశారు. 
 
కల్తీ మద్యం కేసులు 13,419
రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టి, పేదల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పఠిష్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ వారు నిర్వహించిన దాడులలో ఈ ఏడాది 13,419 కేసులు నమోదు చేశారు. కల్తీ మద్యం తయారీతో సంబంధం ఉన్న  8,540 మందిని అరెస్ట్ చేశారు. దాడులలో అక్రమంగా తయారు చేసిన 79,158 లీటర్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. 495 వాహనాలను సీజ్ చేశారు. 
 
ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు
ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్సైజ్ ఆదాయం మొత్తం రూ. 7,903.45 కోట్లు లభిచింది. ఇందులో ఎక్సైజ్ రెవెన్యూ  రూ.2,764.82 కోట్లు కాగా, వ్యాట్(ఎక్సైజ్) రెవెన్యూ రూ.5,138.63 కోట్లు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ వరకు రూ. 8,480.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఐఎంఎల్ కేసులు 204.99 లక్షలు, బీరు కేసులు 115.07 లక్షలు అమ్ముడుపోయాయి. 
 
22 ఎక్సైజ్ డిపోలు
రాష్ట్రంలో మొత్తం 22 ఎక్సైజ్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారానే అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలలో మూడేసి డిపోలు ఉన్నాయి.చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలలో రెండేసి డిపోలు ఉన్నాయి. మిగిలిన అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కో డిపో మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఈ డిపోల ద్వారానే మద్యం సరఫరా అవుతుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments