Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న సినిమాల నుంచి రాజకీయాల్లోకి... (video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:56 IST)
రవిబాబు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి మాధవిలత. ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కొన్నేళ్లుగా సినిమా అవకాశాలు లేక కనుమరుగైన ఈమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో కామెంట్స్ చేసి సంచలనంగా మారింది. ఆ తర్వాత రాజకీయాల వైపు దృష్టి మరల్చిన మాధవి ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
 
మాధవీలత కొన్ని నెలల క్రితం బీజేపీ పార్టీలో చేరి, అన్ని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఈ చురుకుదనంతో పాటు సినీ గ్లామర్ ఆమెకు కలిసి వచ్చే అంశాలుగా భావించిన బీజెపీ అధిష్టానం ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించింది. 
 
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి ఈమె పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినందుకు మాధవి అధిష్టానానికి, ప్రత్యేకంగా కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించిన కొందరు నటీమణులు ఆంధ్రదేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈమె మిగతా పార్టీల అభ్యర్థుల నుండి ఉండే పోటీని ఏ మాత్రం తట్టుకుంటుందో చూడాలి మరి.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments