Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు పోటీగా అంజలి - పవన్ కళ్యాణ్‌ పార్టీలో చేరుతుందట...

ఫైర్ బ్రాండ్ రోజాను ఫాలో అయ్యి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కొందరు. రోజా మాట తీరు, వ్యవహార శైలి, అధికార పార్టీ నేతలను రోజా కడిగిపారేసే విధానం చాలామందికి ఇష్టంగా మారింది. అందులోను సినీ ప్రముఖుల్లో చాలామంది రోజా రాజకీయాల్లో రాణిస్తున్న తీరును గమనిస

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (15:04 IST)
ఫైర్ బ్రాండ్ రోజాను ఫాలో అయ్యి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కొందరు. రోజా మాట తీరు, వ్యవహార శైలి, అధికార పార్టీ నేతలను రోజా కడిగిపారేసే విధానం చాలామందికి ఇష్టంగా మారింది. అందులోను సినీ ప్రముఖుల్లో చాలామంది రోజా రాజకీయాల్లో రాణిస్తున్న తీరును గమనిస్తూ ఉన్నారు. అందులో సినీనటి అంజలి కూడా ఉంది. ముందు నుంచి సవతి తల్లితో గొడవ ఉండటమే కాకుండా తమిళ హీరో జైను ప్రేమించి వార్తల్లో నిలిచిన అంజలి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటోంది.
 
అయితే గత కొన్నిరోజుల ముందు ఢిల్లీకి షూటింగ్ కోసం వెళ్ళిన అంజలి పార్లమెంటుకు వెళ్ళిందట. పార్లమెంటు సమావేశ మందిరం మొత్తాన్ని సందర్శించిన అంజలికి రాజకీయాల్లోకి రావాలనుకునే కోరిక పుట్టిందట. దీంతో మీడియాకు ఈ విషయాన్ని తెలిపిందట. ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న అంజలి అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులను ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే సినిమాల్లో రాణిస్తున్నా రాజకీయాల వైపు వెళ్ళాలనేది ఆమె ఆలోచన. అది కూడా ఎపి పాలిటిక్స్ లోకి రావాలనుకుంటోందట. కొత్తగా వచ్చిన పార్టీలో చేరాలన్న ఆలోచనలో కూడా ఉందట.
 
అంజలి చెబుతున్న మాటలను చూస్తే ఎపిలో కొత్తగా ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్‌ జనసేన మాత్రమే. అందులోను పవన్ సినీ రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి అంజలి ఆ పార్టీవైపు వెళ్ళే అవకాశముంది. జనసేన పార్టీలో అంజలి లాంటి హీరోయిన్లు చేరితే ఆ పార్టీకి మరింత మైలేజ్ పెరిగే అవకాశముంది. మరి పవన్ కళ్యాణ్, అంజలిని పార్టీలోకి ఆహ్వానిస్తాడో.. లేక ఏం చెబుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments