నారా లోకేశ్‌ను 'ప్రజా గొంతుక' అంటూ అభివర్ణించిన నటుడు ఎవరు?

ఠాగూర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (17:55 IST)
తెలుగు సినీ నటుడు శివాజీ చాలా రోజుల తర్వాత వార్తలకెక్కారు. ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సోమవారం కలిశారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత లోకేశ్ నాయకత్వ పటిమ, దార్శనికతపై శివాజీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. 
 
ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని శివాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ను శివాజీ ది వాయిస్ ఆఫ్ పీపుల్ (ప్రజా గొంతుక)గా అభివర్ణించారు. 
 
ఈ సందర్భంగా తాను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్‌కు బహుకరించినట్టు శివాజీ వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్న శివాజీ... ఇపుడు నేరుగా నారా లోకేశ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీలో చేరుతారా అనే సరికొత్త చర్చకు ఈ భేటీ నాది పలికింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments