ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : ఏసీబీ కస్టడీకి ఏసీపీ!

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (12:28 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వర రావును విచారణ నిమిత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు.. మూడు రోజుల పాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఏసీబీ పది రోజుల పాటు కస్టడీ కోరగా మూడు రోజులు మాత్రమే కస్టడీకి  అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ నెల 22వ తేదీన ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.3.95 కోల్ విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments