Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరులోనే శ్రీరామ... రావణాసురుడు బుద్ధి... అతడికి విధించే శిక్ష...?!!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (14:23 IST)
చిత్తూరు మేయర్ అనురాధ దంపతులను అత్యంత దారుణంగా ఈ నెల 17 హత్య చేసిన చింటూ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా కోర్టు ముందు లొంగిపోయాడు. ఇతడి పేరులో శ్రీరామ అనే పేరు ఉన్నప్పటికీ రావణాసురుడిలా మారిపోయాడు. రాక్షసుడిలా సొంత అత్త, మామయ్యలను హతమార్చాడు. కాగా అతడి కోసం రెండు వారాలుగా పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్న తరుణంలో చింటూ నేరుగా చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి సోమవారం లొంగిపోవడం గమనార్హం. 
 
కేసులో సంబంధం ఉందని భావిస్తున్న చింటూ ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్న సమయంలోనే చింటూ కోర్టులో లొంగిపోవడం గమనార్హం. చింటూ లొంగుబాటుతో కఠారి మోహన్ దంపతుల కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 
 
కాగా, సొంత మేనత్త అయిన కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌లను చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఇద్దరిని హత్య చేసినందుకు చింటూకు కోర్టు ఉరి శిక్ష విధిస్తుందా... లేదంటే యావజ్జీవమా అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా చింటూ లొంగుబాటు సమయంలో కోర్టు బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments