Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లర్క్ ఉద్యోగంలో చేరి రూ.కోట్లకు పడగలెత్తిన బీసీ సంక్షేమ అధికారి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (13:33 IST)
తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.యుగంధర్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. ఆయన చిన్నపాటి క్లర్క్ ఉద్యోగంలో చేరి ఇపుడు జిల్లా సీబీ సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మరో అవినీతి తిమింగిలంగా మారారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలును సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. 
 
ఏసీబీ తిరుపతి డీఎస్పీ జనార్థన్ నాయుడు, అనంతపురం ఇన్‌చార్జి డీఎస్పీ జె.శివనారాయణ స్వామిలు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం తిరుచానూరు సమీపంలోని యుగంధర్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో యుగంధర్ పేరుమీద ఉన్న రూ.2.72 కోట్ల ఆస్తుల్లో రూ.1.84 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా గుర్తించారు. 
 
అలాగే, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి వస్తువులతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ, గత 1999లో క్లర్కుగా ఉద్యోగంలో చేరిన యుగంధర్ పలు పదోన్నతులు పొంది ఇపుడు డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్నారని తెలిపింది. ఈ కాలంలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కా సమాచారం అందడంతోనే ఈ సోదాలు చేసినట్టు ఆయన తెలిపారు. 

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments