Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు జ్యూడీషియల్ రిమాండ్ పొడంగించండి..: కోర్టులో సీఐడీ మెమో

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (13:35 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడగించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది. నేటితో చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ ముగుస్తున్నందన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది.
 
మరోవైపు ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బుధవారం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ తరపు వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. బుధవారం వాదనలకు కొనసాగింపుగా ప్రస్తుతం అదనపు ఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత చంద్రబాబు రిమాండ్ పొడగించే విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకుంటారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments