Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్‌కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (19:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం నిలిపివేసిన నేపథ్యంలో.. ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కేబుల్ ఆపరేట్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాత్రం కొత్త కథ చెబుతున్నారు. 
 
టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారంపై జనమే నోరెత్తట్లేదని.. ఆ రెండు ఛానెళ్లకు సంబంధించి ప్రసారాలు అవసరమా అనే చందంగా ప్రశ్నించారు. అయితే సుభాష్ రెడ్డి కామెంట్స్‌పై జర్నలిస్టులు మండిపడుతున్నారు. కేసీఆర్‌కు సుభాష్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడుతున్నారు. జనం వద్దన్నా కావాలన్నా ఆ టీవీ ప్రసారాలు చేయాల్సింది పోయి.. ఛానెళ్ల నిషేధంపై సమర్థించుకోవడం.. ఎంతవరకు న్యాయమని అడుగుతున్నారు. 
 
‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్రగానీ ఏమీ లేదని, న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చాయి.

మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదు’’ అని సుభాష్ రెడ్డి వ్యాఖ్యానించడం వెనుక కేసీఆర్ హస్తం లేకపోలేదని వాపోతున్నారు. ప్రజాస్వామ్యంగా తెలంగాణ సర్కారు వ్యవహరించట్లేదని, అందుకే సుభాష్ రెడ్డి లాంటి వారిచే ఆ రెండు ఛానెళ్లకు సంబంధించిన కామెంట్స్ చేయిస్తుందని జర్నలిస్టులు మండిపడుతున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments