Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎస్ఐ‌ను బూతులు తిట్టిన ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్‌.. పోలీసు కేసు

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (11:18 IST)
చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. తాను ప్రజాప్రతినిధి అన్న అహంకారంతో పోలీసు అధికారిని ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే బూతులు తిట్టింది. ఆ తర్వాత పోలీసు కేసులో బుక్కైంది. ఢిల్లీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఆదివారం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఏఎస్‌ఐ ఓమ్‌పాల్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. స్వల్పగాయాలతో బయటపడ్డ ఓమ్‌పాల్‌ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. 
 
ఇంతలో కారులో కూర్చొన్న ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఏఎస్‌ఐను అసభ్య పదజాలంతో బూతులు తిట్టింది. ఇది పెద్ద వివాదమైంది. ఫలితంగా ఆప్ ఎమ్మెల్యేపై ఏఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ ఘటనంతటినీ ఓ వ్యక్తి వీడియో తీయగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారిందని అధికారులు చెప్పారు. 
 
అయితే, ఈ వివాదాన్ని ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ముందుగా పోలీసు అధికారే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. తాను కూడా ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించనున్నట్లు చెప్పారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments