Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..! రైలుకు ఎదురెళ్లి..!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (12:12 IST)
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన చందానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. ఆ సమయంలో మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నంబర్ల ఆధారంగా అతను పని చేస్తున్న కంపెనీకి పోలీసులు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకటరెడ్డి (30) అని తెలిసింది. అతను గచ్చిబౌలి లోని డీఎస్ టీ వరల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వెంకటరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరు మణికొండలో నివాసం ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. 
 
కాగా వెంకటరెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో సరదాగా ఉండేవాడని తోటి ఉద్యోగుల సమాచారం. అయితే వెంకటరెడ్డి  ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments