Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...

చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో అయితే ఇక వేరే చెప్పక్కర్లేదు. మోటారు బైకుపై ఎంతమంది వీలుంటే అంతమందిని కూర్చోబెట్టుకుని కొందరు మొండి ప్రయాణం చేస్తుంటారు. ఇలా

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (20:51 IST)
చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల విషయంలో అయితే ఇక వేరే చెప్పక్కర్లేదు. మోటారు బైకుపై ఎంతమంది వీలుంటే అంతమందిని కూర్చోబెట్టుకుని కొందరు మొండి ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోవడం జరుగుతుంటుంది. వీటిని ఆపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినట్లే అవుతుంది. 
 
ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించవద్దు బాబోయ్ అని పోలీసులు మొత్తుకుంటున్నా వింటున్నవారు బహు కొద్దిమందే. ఇక హెల్మెట్ విషయం వేరే చెప్పక్కర్లేదు. పోలీసులను అంత దూరంలో చూసి హెల్మెట్ తీసుకుని తగిలించుకుంటారు. అదే పోలీసులు ఎవరూ లేరని నిర్థారణ అయితే హెల్మెట్ తీసి మోటారు సైకిల్ ఇంజిన్ బాక్సుపై పెట్టేసి నడిపేస్తుంటారు. 
 
ఇలాంటివారిని ఏం చేయాలో ఆ సబ్ ఇన్ స్పెక్టరుకు అర్థంకాక ఇలా ఏకంగా దండమే పెట్టేశారు. ఐదుగురితో ద్విచక్ర వాహనంపై అనంతపురంలో వెళుతున్న ఓ వాహన చోదకుడిని ఆపి మరీ  శుభ‌కుమార్ అనే ఇన్స్‌పెక్ట‌ర్ వారికి దండం పెట్టేసి, ఇలా ప్ర‌యాణిస్తే ఎలా అయ్యా ప్రశ్నించాడు. ఆ ఫోటో ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసైనా అలాంటి ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం వస్తుందేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments