Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలం కోసం బంధువు హత్య

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (18:19 IST)
సొంత బంధువని కూడా చూడకుండా పొలం కోసం యువకుడిని హత్య చేసిన ఘటన విద్యాధరపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

విద్యాధరపురం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతానికి చెందిన కూరాకుల రమేష్‌ (40) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రమేష్‌కు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లి అప్పలనర్సమ్మతో కలిసి ఉంటున్నాడు. తల్లితో పాటు అన్నయ్య లీలాప్రసాద్‌ తరచూ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉండేవారు. అయినా సరే పెళ్లికి అంగీకరించేవాడు కాదు.
 
 ఈ క్రమంలో గత 12వ తేదీ రమేష్‌ తన అన్నకి ఫోన్‌ చేసి తల్లిని నీ దగ్గర పెట్టుకోవాలని అడిగాడు. ఎందుకని ప్రశ్నించగా నేను ఎవరికి భారం కాకూడదని సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్‌ ఫోన్‌ నుంచి అన్నయ్య ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. తన బైక్‌ను ఇన్నర్‌ రోడ్డులో రైట్‌ సైడ్‌ ఉంచానని, వచ్చి తీసుకువెళ్లాలని.... ఐయామ్‌ వెరీ సారీ... అమ్మ.. విజయ అక్క జాగ్రత్త.. అని ఆ మెసేజ్‌లో ఉంది.
 
దీంతో అనుమానం వచ్చి ఇన్నర్‌ రోడ్డులోకి వచ్చి చూసేసరికి రోడ్డుపై బైక్‌ ఉంది. బైక్‌ కవర్‌లో ఫోన్‌ కూడా కనిపించింది. కొద్ది దూరం వెళ్లి చూడగా ఖాళీ స్థలంలో సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది.

పక్కనే చెప్పులు, పెట్రోల్‌ తెచ్చుకున్న బాటిల్, అగ్గిపెట్టె కనిపించాయి. అయితే, మానసిక పరిస్థితి సరిగా లేక రమేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఈ ఘటనపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తెల్లవారుజాము నుంచి జన సంచారంతో ఉండే ఇన్నర్‌ రోడ్డులో ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే అటుగా వెళ్లే వారు గుర్తించలేకపోయారా.. అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఈ ఘటన వెనుక ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా... లేక ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.దాడి సమయంలో అక్కడే ఉన్న కిషోర్‌ పెద్దమ్మ కుమారుడు గూడపాటి సుబ్బారావు చంపవద్దని ప్రాధేయపడినా వదలలేదు.అంబర్‌పేటలో దాసరి బుల్లెమ్మకు 11.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
 
ఆమె భర్త, కుమారుడు మృతి చెందడంతో 1996లో తణుకుకు చెందిన రాజశేఖర్‌కు విక్రయించింది. టీడీపీ మాజీ ఎంపీటీసీ జువ్వా స్వామి, ఏసుపాదం, సులేమాన్‌రాజులకు బుల్లెమ్మ మేనత్త. పొలానికి తామే వారసులమంటూ అన్నదమ్ములైనవారు ఆమెను వేధిస్తున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి.

పొలాన్ని కౌలుకు చేస్తున్న కిషోర్‌ను ఖాళీ చేయించాలని టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆపార్టీ నాయకుల ద్వారా అతనిపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నెల 8న కిషోర్‌ పొలాన్ని కోసి ధాన్యం ఆరబోయగా టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జువ్వా స్వామి, అతని సోదరులు ధాన్యాన్ని ఎత్తుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఈ నేపథ్యంలో పొలానికి వెళ్లిన కిషోర్‌ను పథకం పన్నిన దుండగులు రాడ్లు, గొడ్డళ్లతో కొట్టి చంపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు నిందితులు జువ్వా ఏసుపాదం, జువ్వా స్వామి, జువ్వా సులేమాన్‌రాజుతో పాటు శశికుమార్, బుచ్చిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు, టీడీపీ కీలక నేత గన్ని గోపాలం ఈ హత్యకు పథకం పన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. వివాదంలో ఉన్న 11.50 ఎకరాల భూమిపై అతని కన్నుపడిందని, ఆ భూమిని కాజేసేందుకే కుట్రపన్ని నిందితులను రెచ్చగొట్టారని ప్రత్యక్ష సాక్షి గూడపాటి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments