Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్తనిధుల కోసం శేషాచలం కొండలనే తవ్వేసిన ఘనుడు

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:29 IST)
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా గుప్త నిధుల కోసం శేషాచలం కొండలనే త్రవ్వేశాడు. సంవత్సరం పాటు ఈ తతంగం మొత్తం సాగుతోంది. అది కూడా భారీ త్రవ్వకాలు చేసినట్లు  పోలీసులు గుర్తించారు. 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. అయితే నిందితుడు మంకు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
అలాగే అతనికి సహాయం చేసిన మరో ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు అలిపిరి పోలీసులు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఒక స్వామీజీ చెప్పడంతో సొరంగం త్రవ్వినట్లు అంగీకరించాడు నిందితుడు మంకునాయుడు. నిందితుడిని వెంటబెట్టుకుని సొరంగంను తనిఖీ చేశారు పోలీసులు.
 
కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు పోలీసులు. ఏడాది కాలంగా రహస్యంగా సొరంగం త్రవ్వకం సాగుతున్నట్లు గుర్తించారు. అసలు పోలీసులు, అటవీశాఖాధికారులు, టిటిడి విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా త్రవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments