Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపి పొలంలో పూడ్చేశాడు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (22:39 IST)
ఐదు సంవత్సరాలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరు లేనిదో మరొకరు లేరని అనుకున్నారు. పెద్దలు వారిద్దరి పెళ్ళి చేశారు. అయితే పెళ్ళయిన కొన్ని నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. గతంలోలా తనతో లేదని ఆవేదనకు గురయ్యాడు. నిద్రిస్తున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగలేదు ఆమెను తీసుకెళ్ళి పొలంలో పూడ్చేశాడు. చిత్తూరు జిల్లాలో సంఘటన చోటుచేసుకుంది.
 
కురబలకోట మండలం పెద్దపల్లికి చెందిన మల్లిరెడ్డి, గాయత్రిలకు సంవత్సరం క్రితం వివాహమైంది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇష్టపడటంతో పెద్దలు పెళ్ళిళ్ళు చేశారు. మొదటి మూడునెలల పాటు భార్యతో ఎంతో అన్యోన్యంగా ఉన్నాడు మలిరెడ్డి. కానీ ఆ తరువాత ఆమెపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు.
 
తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఊహించుకున్నాడు. గ్రామంలో కొంతమంది యువకులతో తన భార్య మాట్లాడడం చూసి ఓర్చుకోలేకపోయాడు. ఆమెపై కోపం పెంచుకున్నాడు. నిన్న రాత్రి నిద్రిస్తున్న గాయత్రిని రోకలి బండతో కొట్టి చంపేశాడు. 
 
ఆ తరువాత ఎవరికి అనుమానం రాకుండా తన పొలంకు తీసుకెళ్ళి శవాన్ని పూడ్చి ట్రాక్టర్‌తో చదును చేసి ఏమీ ఎరుగనట్లు పోలీస్టేషన్లో తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. మొదట్లో పోలీసులు గ్రామంలో ఎవరో చేసి ఉంటారని అనుకున్నారు. కానీ భర్త కదలికల్లో అనుమానం రావడంతో అతన్ని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నాడు. పొలం నుంచి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments