Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండేళ్ళ కూతురికి విషమిచ్చి చంపేసిన తండ్రి..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:52 IST)
కుటుంబమన్న తరువాత గొడవలు షరా మామూలే. పెళ్ళి చేసుకున్న తరువాత రకరకాల సమస్యలు వస్తుంటాయి.. సర్దుకుపొమ్మని పెద్దలు చెబుతుంటారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఒక వ్యక్తి తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న చిన్న కారణంతో అభంశుభం తెలియని రెండేళ్ళ చిన్నారిని అతి దారుణంగా విషమిచ్చి చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురంకు చెందిన ఆదేశ్వర్, నందినీలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహమే. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఆర్థిక సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే గత రెండురోజుల క్రితం భర్తతో గొడవ వేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని.
 
తన పెద్దకూతురిని తీసుకుని.. చిన్న కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తన భార్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆదేశ్వర్. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఫోన్ తీయకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు ఆదేశ్వర్. ఇంట్లో పురుగులు మందు రెండేళ్ళ కుమార్తెకు తాగించాడు. ఆ చిన్నారి చనిపోయిన తరువాత తాను కూడా ఆ పురుగుల మందు తాగాడు.
 
అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments