Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడికొక గోమాత: టిటిడి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 28 దేవాల‌యాల్లో గుడికో  గోమాత  కార్య‌క్ర‌మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో క‌లిసి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేయ‌నున్నారు.

తెలంగాణ‌లోని పాత 10 జిల్లాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల్లో  జిల్లాకు ఒక ఆల‌యం చొప్పున‌, క‌ర్ణాట‌క రాష్ట్రంలోని 5 దేవాల‌యాల్లో క‌లిపి మొత్తం 28 ఆల‌యాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు.

టిటిడి ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని తీర్మానించారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా గోవును టిటిడి అంద‌జేస్తుంది.

గోదానం పొందిన సంబంధిత ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది. టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత - టిటిడి అనే బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ముంద‌స్తు అనుమ‌తితోనే భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల డైరెక్ట‌ర్ నుంచి పొంద‌వ‌చ్చు. 
 
ఈ స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శివ‌కుమార్‌, గోవింద‌హ‌రి, డిపి.అనంత‌, జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఎస్వీ గోసంర‌క్ష‌ణశాల డైరెక్ట‌ర్ డా. హ‌ర‌నాథ‌రెడ్డి పాల్గొన్నారు. హెచ్‌డిపిపి కో-అప్ష‌న్ స‌భ్యులు బొమ్మ‌దేవ‌ర సుబ్బారావు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments