Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. యువకుడికి పదేళ్ల జైలు శిక్ష

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:47 IST)
అనంతపురం జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు వెలువరించింది.

వివరాలు... అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి పదేళ్ల జైలు, రూ. పది వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు జడ్జి బి.సునీత తీర్పు చెప్పారు. 24-08-2013 తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండేది. 
 
కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకుని రాజు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అరుపులు వినిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని చికిత్స నిమిత్తం  కళ్యాణదుర్గం ఆ తర్వాత అనంతపురం తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు.

అప్పటి కళ్యాణదుర్గం సి.ఐ జి.రామకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన అనంతపురం మహిళా కోర్టు జడ్జి నిందితుడికి పదీ సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 
 
పక్కాగా దరాప్తు చేసిన సి.ఐ ను మరియు ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీదేవి, కోర్టు కానిస్టేబుల్  కృష్ణలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments