Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి : హత్యనా?... ఆత్మహత్యనా?

విశాఖపట్టణంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, ఈ విద్యార్థిని హత్య చేశారా.. లేక ఆత్మహత్యనా అనే అనే అంశంపై కలకలం రేగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 25 జులై 2016 (10:28 IST)
విశాఖపట్టణంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, ఈ విద్యార్థిని హత్య చేశారా.. లేక ఆత్మహత్యనా అనే అనే అంశంపై కలకలం రేగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్నానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తనూజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిండ్రులు అర్థరాత్రి దాకా వెదికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తనూజ కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక భాగంలోని చెత్త కుప్పల్లో విగత జీవిగా పడి ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తనూజతో సన్నిహితంగా మెలగుతున్న దిలీప్ అనే బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 
ఈవ్ టీజింగ్ ఆరోపణలపై తల్లితో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో శనివారం రాత్రి 8.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ తెల్లారేసరికి శవమై కనిపించిన తీరు విశాఖలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ కేసు మిస్టరీ పెను సవాలునే విసురుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments