Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఆశ చూపి బాలికపై అత్యాచారం...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:55 IST)
చాక్లెట్ ఆశ చూపి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. అనంతరం ఆ కామాంధుడు పారిపోయాడు.  ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో రమావత్‌ శ్రీను నాయక్‌(24) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన శ్రీను.. దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. 
 
ఈనేపథ్యంలో శుక్రవారం శ్రీను కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుకకు వెళ్లారు. దీంతో షాపును చూసుకునేందుకు శ్రీను అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో తమ షాపు ముందు సోదరుడితో కలిసి ఆడుకుంటున్న బాలిక(9)కు చాక్లెట్ ఆశ చూపాడు.
 
చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను షాపులోకి తీసుకెళ్లాడు. బాలిక వెంట వస్తున్న సోదరుడిని భయపెట్టి ఇంటికి పంపేశాడు. దీంతో చెల్లి ఎక్కడ? అని కుమారుడిని తల్లి ప్రశ్నించింది. శ్రీను ఇంటిలోకి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె ఒక్క పరుగున అక్కడకు చేరుకుంది. అప్పటికే బాలికపై అత్యాచారానికి పాల్పడిన శ్రీను ఘటనాస్థలం నుంచి పత్తాలేకుండా పారిపోయాడు. 
 
కానీ, కుమార్తె మర్మాంగం నుంచి రక్తస్రావం కావడాన్ని గుర్తించిన తల్లి... కుమార్తెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికీ, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments