Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పై పోరాటంలో కోలుకున్న 8 మంది

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (21:00 IST)
పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల (కోవిడ్ ఆసుపత్రి) నందు అత్యు త్తమ వైద్య సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న 8 మంది బుధవారం రాత్రి డిశ్చార్జ్ అయినట్లు పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ (కోవిడ్ ఆసుపత్రి )మెడికల్ సూపరింటెండెంట్ డా.బి. ఎన్. చందర్ తెలిపారు.

డిశ్చార్జి అయిన వారిలో ఏప్రిల్ 2వ తేదీన చేరిన విజయవాడలోని రాణిగారితోట, చెక్ పోస్ట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, నూజివీడు, చందర్లపాడు లోని మొప్పళ్ల లకు చెందిన ఒక్కో రు,ఏప్రిల్ 4వ తేదీన చేరిన జగ్గయ్యపేట, కానూరు, శనతనగర్, నందిగామలకు చెందిన వారు ఒక్కోరున్నారు.

కరోనా బారినపడి కోలుకున్న బాధితులు మాట్లాడుతూ పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ వైద్యులు ఇతర సిబ్బంది తమకు అత్యుత్తమ వైద్య సేవలను అందించారని, మా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ అధునా తన మైన చికిత్సను అందించి అత్యంత జాగ్రత్తగా మాకు వైద్య సహాయాన్ని అందించారని, ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ వైద్య బృందానికి కరోనా బాధితులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన వ్యక్తులను కరోనా జిల్లా ప్రత్యేక అధికారి సిద్దార్ధ జైన్,జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ అభినందించారు. వారికి మెరుగైన వైద్యం అందించి కోలుకునేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డ్రా. పి ఎస్.ఎన్ మూర్తి,మెడిసిన్ విభాగపతి డా.ఈశ్వర్ ప్రసాద్, డా.ఆంజనేయ ప్రసాద్, ఊపిరితిత్తుల ప్రొఫెసర్ డా.భాను రేఖ, ఏఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments